వ్రాయనా ఇచట వనితలపై పద్యాలు
పోయనా కొందరిపై మీరెరుగని అచ్చరాలు
మెచ్చెదరో మరి నొచ్చెదరో ఎరుగను నేనెరుగనుగా
ఇచ్చగించకున్న ముచ్చటించరేమో పెద్దలు మరి అక్షర ఒజ్జలు
1.పొట్ట చే పట్టుకొని పట్నవాసము చనె
పడతి తా ఇంట లేమి చని కలుములూర
కోతి వేషములేయు మగరాయడల చెంత
కొలువు చేయుటెటుల కొదిగ చెపుమ….
2.కోమలాంగుల కనుచు కనుగీటు శూరులూ
పరాంగన కొంగు చేబట్ట తపియించు ధీరులూ
మెల్ల మెల్లగ మాట కలిపేటి వీరులూ
ముగ్ధ కన్నియ మనసు చెలగేటి చోరులూ…
3.యాసిడోసెదటంచు బెదిరించు ప్రేమికులు
పీక కోసెదనంచు పలుకు ప్రియులూ
ఉందురే ఓ యమ్మ నీవు జాగరూకవు కమ్మ
చెప్పజాలమో ఇంతి మేమింతకు మించి
4.హద్దు దాటకె లలన అర్హంబు కాకనే
పలుమారు ప్రియు పలుకు మాట నమ్మి
ఏరు దాటిన పిదప తెప్ప చందమౌను
వినుము చెలి సుదతి కెపుడు మనువె అందమౌను
5.ఇంతులను కారణంబెట్టి..ఇహలోక ఆశల జను
ఈప్సితార్ధంబు గలవాడదియేమి స్వామీ
హొయలు మరి సోయగాల్ రమణులకు
పుట్టుకతో జనించు పుణ్యంబు కాదా !!!
6.పొట్టకూటి కొరకు ఉపాధికేగెడు వనితకేమి
తెలుసు వ్యూహాలు మరియు మగవారి మోహాలు
హరిణిని సైతం వేటాడు మృగాడికే మెరుక
ఎల్లలెరుగని మగువ మనసు మమత
7.అల్లిబిల్లి మగవారి ఇచ్చకంబు వలపు
అల్లదే నమ్ముట వనిత దుర్బలత కాదా
చెప్పరాద ఓ మగధీర ఇది (గ)విని
సత్వరము నీ తలపు మా చెవిని చేర...
